stock market: మూడో రోజూ నష్టాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 71 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- 18 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- నష్టాలు చవిచూసిన ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు తదితర సంస్థల షేర్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), రొటామాక్ కుంభకోణాల ప్రభావం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల బాటలోనే ముగిశాయి. స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలు చవి చూడటంతో మదుపరులు దిగాలుపడ్డారు. సెన్సెక్స్ 71 పాయింట్లకు పైగా నష్టపోయి 33,704 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి, 10,360 పాయింట్ల వద్ద స్థిరపడింది.
వేదాంత, అంబుజా సిమెంట్స్, ఐడియా సెల్యులార్, భారతి ఇన్ ఫ్రాటెల్, కోల్ ఇండియా తదితర సంస్థల షేర్లు లాభపడగా, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, అరబిందో ఫార్మా, ఎస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా మొదలైన సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.