Tollywood: సంగీత దర్శకుడు కీరవాణిపై జైకుమార్ విమర్శలు

  • భక్తికి సంబంధించిన మ్యూజిక్ ని సెక్స్ సినిమాలో పెట్టారు
  • ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పేరు పడగానే ‘ఓం’ కారం వినపడుతుంది
  • ఇలాంటి వాళ్లను వదిలేస్తే మాల్కోవాకు గుడులు కూడా కడతారు!
  • విశ్వహిందూ పరిషత్ కు ఫిర్యాదు చేస్తా: జై కుమార్

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) లఘుచిత్రం ప్రమోషన్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పని చేసిన వారందరిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో జీఎస్టీకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కూడా విచారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, జీఎస్టీ స్క్రిప్ట్ తనదేనంటూ గతంలో ఆరోపణలు చేసిన రచయిత జైకుమార్ ఈ సందర్భంగా స్పందించారు. జీఎస్టీ చిత్రానికి ‘ఓం’ కారంను కీరవాణి స్వరపరిచారని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ క్రైస్తవ భక్తిగీతాలు, అయ్యప్పస్వామి భక్తి గీతాలు, నాగార్జునతో షిర్డి సాయిబాబా మూవీకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు. కీరవాణి అంత గొప్ప సంగీత దర్శకుడు మియా మాల్కోవా ప్రైవేట్ పార్ట్స్ పై ఓం కారాన్ని స్వరపరచడం బాధాకరమైన విషయం.

ఒకవేళ గుడికి వెళ్లి నప్పుడు ‘ఓం’ కారం వింటుంటే ఎలా అనిపిస్తుంది! భక్తికి సంబంధించిన మ్యూజిక్ ని తీసుకెళ్లి సెక్స్ సినిమాలో పెట్టారు. తన మ్యూజిక్ ని ఆర్జీవీ గారు ఎలివేట్ చేశారని కీరవాణి గారు ట్వీట్ చేయడం చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటి వాళ్లను అలానే వదిలేస్తే మియా మాల్కోవాకు గుడులు కూడా కడతారు! ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పేరు పడగానే ‘ఓం’ కారం వినపడుతుంది. అది ‘ఓం’ కారం కాదని వాళ్లు తమ వక్రబుద్ధి ప్రదర్శించవచ్చు! కానీ, ఆ సినిమాలో వినబడేది ‘ఓం’ కారం కాదని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే, స్పష్టంగా వినపడుతోంది. ‘బూతు’ మీద శ్లోకాలు వేస్తే అది బూతు కాకుండా ఉంటుందా? ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు, విశ్వహిందూ పరిషత్ దగ్గరకు వెళుతున్నాను. ఆ తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ అధికారులను కలుస్తా’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News