priya varier: 'అందరికీ థ్యాంక్స్'.. సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రియా వారియర్ స్పందన!
- సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు
- 'మాణిక్య మలరయా పూవై' పాటపై అభ్యంతరాలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు
- దేశంలో ఎక్కడా కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు- ప్రియా వారియర్
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమకు పెద్ద రిలీఫ్ లభించిందని ఇంటర్నెట్ సంచలనం, కేరళ నటి ప్రియా వారియర్ తెలిపింది. మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’లో ఆమె నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాటలో కళ్లతో ఆమె అభినయించిన హావభావాల పట్ల పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆమెకు సానుకూలంగా ఆదేశాలు వచ్చాయి.
'సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు.. 'మాణిక్య మలరయా పూవై' పాటపై అభ్యంతరాలు తెలుపుతూ నాపైన, మా దర్శకుడు ఒమర్ లాలూపైన హైదరాబాద్లో నమోదైన ఎఫ్ఐఆర్ పై స్టే విధించడంతో పాటు ఇతర ఏ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాకు సహకరించిన అడ్వకేట్ హారిస్ బీరన్కి, మద్దతు తెలిపిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీడియాకి థ్యాంక్స్' అని పేర్కొంది.