Jagan: జగన్, విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేయండి: డీజీపీకి రాయపాటి లేఖ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5bab3c1765a9f393c2fd073dba7d81b490c98ccf.jpg?format=auto)
- ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరించారు
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు
- కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయండి
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఏపీ డీజీపీకి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ లను కించపరిచేలా విజయసాయిరెడ్డి మాట్లాడారని... గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లను జగన్ బెదిరించారని లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వీరిద్దరూ వ్యవహరించినందుకు ఐపీసీ సెక్షన్ 504, 505 1(బీ)... బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506(2), 124(ఏ), 307 ఆర్ డబ్ల్యూ, 511తో పాటు... పరువు నష్టం కలిగించినందుకు సెక్షన్ 500 కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని లేఖలో కోరారు.