Rashmi goutham: రష్మీ గౌతమ్‌ను కదిలించిన వీడియో... ఆన్లైన్లో వైరల్!
- యాంకర్ని కదిలించిన పైశాచిక వీడియో
- షేర్ చేయడం కరెక్టేనని భావిస్తున్నట్లు ప్రకటన
- ఇలాంటి న్యూస్ ఎక్కడా చూడనేలేదని వెల్లడి
ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ తన హృదయాన్ని కదిలించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సందేశంలో...ఈ వీడియో తనకెవరో ఫార్వడ్ చేశారని, దీనిని షేర్ చేయాలని తనకు అనిపించిందని ఆమె చెప్పింది. వీడియో చూస్తుంటే...ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఇంత దారుణంగా ఆమెను హింసిస్తున్నట్లు తెలుస్తోందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.
తానిప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త కళ్లారా చూడనేలేదని ఆమె అంది. అందుకే దీనిని షేర్ చేస్తున్నానని, తాను చేసింది కరెక్టేనని భావిస్తున్నట్లు ఈ క్రేజీ యాంకర్ పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో ఇంత దారుణానికి పాల్పడుతున్న వ్యక్తిని, అందుకు సహకరించిన వారిని, అక్కడే ఉండి కళ్లప్పగిచ్చి ప్రేక్షక పాత్ర వహించిన వారినీ...ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పైశాచిక చర్యకు పాల్పడిన వారందరినీ సైబర్ విభాగం పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మానవత్వం ఉన్న నెటిజన్లు కోరుతున్నారు.
<blockquote class="twitter-video" data-lang="en"><p lang="en" dir="ltr">This was a forward sent to me the girl clearly looks sedated and it’s oblivious she is being held against her wish i Dont see any news abt this incident anywhere I was expected to share this I hope I have done the right thing <a href="https://t.co/tbE1SaxisS">pic.twitter.com/tbE1SaxisS</a></p>— rashmi gautam (@rashmigautam27) <a href="https://twitter.com/rashmigautam27/status/966723707476631554?ref_src=twsrc%5Etfw">February 22, 2018</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>