tv: ఎక్కువగా టీవీ చూస్తే.. రక్తం గడ్డకట్టే అవకాశం ఉందట!

  • గంటల తరబడి టీవీ చూస్తే అంతే సంగతులు
  • గుండె, ఊపిరితిత్తులు, ఊబకాయం సమస్యలు వస్తాయి
  • మొత్తంగా చెప్పాలంటే ప్రాణాలకే ప్రమాదం

ఖాళీ సమయం దొరికితే టీవీ ముందు కూర్చునే వారు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే, ఇది మంచిది కాదని బర్లింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరించారు. కూర్చొని ఎక్కువ సేపు టీవీ చూస్తే... రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. అంతేకాదు, చిరుతిళ్లు తింటూ టీవీ చూస్తే, గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎక్కువగా టీవీ చూసేవారికి ఊబకాయ సమస్యలు వస్తాయని చెప్పారు. 45 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15,158 మందిపై వారు అధ్యయనం చేశారు. టీవీ చూసే వారిలో గుండెకు సంబంధించిన ముప్పు ఎక్కువగా ఉందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువగా టీవీ చూసేవారి ఊపిరితిత్తులు కూడా పాడవుతాయని... ఓవరాల్ గా చెప్పాలంటే ప్రాణాలకే ప్రమాదమని పరిశోధకులు తేల్చేశారు. 

  • Loading...

More Telugu News