venu: నేను చేసింది చిన్న సాయం .. అది బన్నీ ఎంతోమందికి చెప్పడం ఆనందమేసింది: కమెడియన్ వేణు
- 'గోన గన్నారెడ్డి' పాత్ర తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది
- ఈ విషయంలో నేను బన్నీకి చిన్న సాయం చేశాను
- అది ఆయన మరిచిపోలేదు
- ప్రతి వేదికపై నా పేరు చెప్పాడు
చిన్న చిన్న పాత్రలతో తన నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తూ .. కమెడియన్ గా వేణు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఉండగా, 'రుద్రమదేవి' ప్రస్తావన వచ్చింది. అప్పుడు వేణు స్పందిస్తూ .. " 'రుద్రమదేవి'లో బన్నీ .. గోన గన్నారెడ్డి పాత్రను పోషించాడు. ఆ పాత్ర ఆ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. ఆ పాత్రను రైటర్ రాజసింహ గారు రాశారు. నేను తెలంగాణ భాషను బాగా మాట్లాడతాను .. అందువలన ఆయనతో నన్ను కూడా బన్నీ దగ్గరికి రమ్మన్నారు"
"నాకు భయమేస్తుంది సార్ .. అంటే , 'నీ గురించి ఒక రేంజ్ లో బన్నీ కి చెప్పాను .. పదా' అంటూ తీసుకెళ్లారు. కథ గురించి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే , ఈ సందర్భంలో ఇలాంటి డైలాగ్ పడితే బాగుంటుందని ఒక సౌండింగ్ చెప్పాను. అది బన్నీకి బాగా నచ్చడం .. ఆయన గుణశేఖర్ గారికి చెప్పడం .. అది ఓకే కావడం జరిగిపోయాయి. రెగ్యులర్ గా షూటింగ్ కి వెళుతూ తెలంగాణ స్లాంగ్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. నేను చేసిన ఆ చిన్న సాయాన్ని గురించి .. ఈ సినిమాకి సంబంధించిన అన్ని వేదికలపై బన్నీ నా పేరు చెప్పాడు .. ఆ క్రెడిట్ ఇచ్చిన బన్నీకి హ్యాట్సాఫ్" అంటూ చెప్పుకొచ్చాడు.