BJP: రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించిన బీజేపీ.. వివరాలు!
- కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించిన ఏపీ బీజేపీ
- అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దన్న నేతలు
- రాయలసీమను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ ఫైర్
రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ ను బీజేపీ ప్రకటించింది. కర్నూలులో జరిగిన సమావేశంలో ఈ డిక్లరేషన్ ను విడుదల చేసింది.
డిక్లరేషన్ లోని ప్రధాన అంశాలు ఇవే:
- రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
- సీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలి.
- రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలి.
- సీమ ఇరిగేషన్ కు రూ. 10 వేల కోట్లు కేటాయించాలి.
- వచ్చే బడ్జెట్ లో రాయలసీమకు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలి.
- రాయలసీమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి.
- 6 నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని అన్నారు. రాయలసీమను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. డిక్లరేషన్ లోని డిమాండ్లను సాధించుకునే క్రమంలో... ఈ నెల 28వ తేదీ నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.