stock market: మార్చ్ 'ఎఫ్ అండ్ ఓ'ల ప్రభావం.. 300 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
- లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 323 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 108 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. మార్చ్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సిరీస్ పై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు తోడవడంతో... ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు ఎగబాకి 34,142కి పెరిగింది. నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 10,491 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జై ప్రకాశ్ అసోసియేట్స్ (17.07%), మైండ్ ట్రీ లిమిటెడ్ (9.60%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (9.33%), కావేరీ సీడ్ కంపెనీ (7.38%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (7.06%).
టాప్ లూజర్స్:
జుబిలెంట్ లైఫ్ సైన్స్ (-10.16%), వక్రాంగీ (-5.00%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (-3.44%), సీమెన్స్ లిమిటెడ్ (-2.34%), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (-1.76%).