Kamineni Srinivas: మంత్రి కామినేని చర్చల ఫ‌లితం.. దీక్ష విరమించిన ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం దీక్ష
  • డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కామినేని 
  • రేపటి నుండి విధులకు హాజరు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న ఉద్యోగ సంఘ ప్రతినిధులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు అమ‌రావ‌తిలోని సచివాలయంలోని త‌న‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, విద్యాసాగర్ తోపాటు హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులతో మంత్రి కామినేని శ్రీనివాస్ చర్చించడంతో ఉద్యోగులు దీక్ష విర‌మించారు.

యూనివర్సిటీ నిధుల సంరక్షణకు ప్రత్యేకంగా జీవో త్వరలో విడుదల, అమరావతిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏర్పాటుకు సీఆర్‍డీఏ ద్వారా స్థ‌లం కేటాయింపు వంటి అంశాల‌తో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేటాయించే గ్రాంట్ ను రూ. 6 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంపుద‌ల‌పై స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. యూనివర్సిటీ అడ్‍హక్ ఉద్యోగుల జీతాల పెంపుదలపై మంత్రి కామినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. మంత్రి చర్చలమేరకు సంతృప్తి చెందిన ఉద్యోగులు దీక్షను విరమించి రేపటి నుండి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News