munipalle raju: ప్రముఖ సాహితీవేత్త మునిపల్లె రాజు ఇకలేరు!
- సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపునకు నడిపించడానికి ఎనలేని కృషి చేసిన మునిపల్లె రాజు
- అనారోగ్యంతో బాధపడుతూ మృతి
- అనేక సాహితీ పురస్కారాలు అందుకున్న రచయిత
సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపునకు నడిపించడానికి ఎనలేని కృషి చేసిన మునిపల్లె బక్కరాజు ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ రోజు కన్ను మూశారు. సమాజంలో ఉన్న మూడ నమ్మకాలను తొలగించడానికి ఆయన ఎన్నో చర్చల్లో పాల్గొని అవగాహన కల్పించారు. ఆయన గొప్ప రచనలు కూడా చేశారు. పుష్పాలు-ప్రేమికులు-పశువులు, దివోస్వప్నాలతో ముఖాముఖి, మునిపల్లె రాజు కథల సంపుటాలుగా ఆయన రచనల్లో ప్రముఖమైనవి.
ఆయన అప్పట్లో రాసిన ‘పూజారి’ నవలను ఏఎన్నార్ హీరోగా బి.ఎన్.రెడ్డి ‘పూజాఫలం’ పేరుతో సినిమా తీశారు. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామంలో 1925లో జన్మించారు. సాహితీ రంగానికి చేసిన కృషికిగానూ జ్యేష్ట లిటరరీ ట్రస్ట్ పురస్కారం, రావి శాస్త్రి మెమోరియల్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం వంటి పలు అవార్డులను ఆయన అందుకున్నారు.