Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. సమాన ప్రైజ్ మనీ అడిగినందుకు రూ.25 లక్షలు కట్!
- తనకు రూ.50 లక్షలు, సిబ్బందికి రూ.20 లక్షల ప్రైజ్‌మనీపై ద్రవిడ్ అసంతృప్తి
- స్పందించిన బీసీసీఐ.. ప్రైజ్‌మనీ కట్
- అందరికీ చెరో రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకటి తలస్తే బీసీసీఐ మరొకటి తలచింది. ద్రవిడ్ సమాన ప్రైజ్‌మనీ డిమాండ్‌ను వ్యతిరేకంగా అర్థం చేసుకున్న క్రికెట్ బోర్డు అతడికిచ్చిన దాంట్లో ఏకంగా రూ.25 లక్షలు కట్ చేసింది.
అండర్-19 ప్రపంచకప్‌ను దేశానికి అందించడంలో కీలకపాత్ర పోషించిన ద్రవిడ్‌కు బీసీసీఐ రూ.50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. క్రికెటర్లకు రూ.30 లక్షల చొప్పున, సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
తనకు రూ.50 లక్షలు, సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ద్రవిడ్.. వారు కూడా తనలాగే కష్టపడ్డారని, ప్రైజ్‌మనీ విషయంలో ఈ తేడాలెందుకంటూ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటనను సవరించింది. గతంలో ద్రవిడ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలను రూ.25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ సహా సిబ్బందికి కూడా చెరో రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. సపోర్టింగ్ స్టాఫ్ మరింతమందికి ఈ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయిస్తూ మరింతమందిని జాబితాలో చేర్చింది.