Sridevi: శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలు.. వీటికి సమాధానాలేవి?
- వివాహం జరిగిన నాలుగు రోజుల వరకు శ్రీదేవి హోటల్ లోనే ఎందుకున్నారు?
- కుటుంబ సభ్యులు గుండెపోటు అని ఎలా చెప్పారు?
- తూలి పడిపోతే తలపై గాయాలెందుకు లేవు?
ప్రముఖ సినీనటి శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఫార్మాలిటీస్ పూర్తికాని నేపథ్యంలో ఆమె మృతదేహం ఇంకా ముంబై చేరలేదు. దీనికి తోడు దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన విషయాలు, కుటుంబ సభ్యులు చెబుతున్న వాదన మధ్య పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే...
* మేనల్లుడి పెళ్లి జరిగింది ఈ నెల 20న అయితే 24 వరకు ఆమె దుబాయ్ లోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది?
* హోటల్ సిబ్బంది సమాచారం మేరకు ఆమె 22వ తేదీ మధ్యాహ్నం నుంచి మృతి చెందినంతవరకు అంటే 24వ తేదీ వరకు శ్రీదేవి అసలు హోటల్ రూమ్ నుంచి బయటకు రాకుండా ఎందుకు ఉంది? దుబాయ్ పోలీసులు పేర్కొంటున్నట్టు ఆమె మద్యం సేవిస్తూ ఉన్నారా? ఈ కారణంగానే బాత్రూంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారా?
* రెండున్నర రోజుల పాటు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది లోపలికి వెళ్లి చూశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబీకుల స్పందన లేకపోవడానికి కారణమేంటి?
* శ్రీదేవిని సర్ ప్రైజ్ చేసేందుకు బోనీకపూర్ దుబాయ్ వెళ్లారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు నిజంగానే ఆమెను సర్ప్రైజ్ చేసేందుకు 24న సాయంత్రం ముంబై నుంచి దుబాయ్ వెళ్లారా? లేక శ్రీదేవి మరణ వార్త తెలిశాక దుబాయ్ వెళ్లారా?
* గతంలో శ్రీదేవికి ఎప్పుడూ హృద్రోగ సమస్యలు లేవని, ఆమె గుండెపోటుతో మృతి చెందడం బాధకలిగిస్తోందని మరిది సంజయ్ కపూర్ మీడియాకు వెల్లడించారు. దీనిని ఆయన ఎలా చెప్పగలిగారు?
* బోనీకపూర్ తన స్నేహితుడికి కాల్ చేసి, ఆయన వచ్చిన తరువాత తలుపులు బద్దలు కొట్టి హాస్పిటల్ కు తీసుకెళ్లారన్న ప్రచారంలో వాస్తవమెంత? శ్రీదేవిని ఆసుపత్రికి తీసుకెళ్లింది హోటల్ సిబ్బందా? లేక బోనీకపూరా?
* సాధారణంగా నీటిలో మునిగి ఎవరైనా మరణిస్తే ఫోరెన్సిక్ రిపోర్టులో అంతవరకే ప్రస్తావిస్తారు. ప్రమాదవశాత్తూ మునిగిపోయారా? లేదా ఎవరైనా బలవంతంగా నీటిలో ముంచి చంపేశారా? అన్నది చెప్పలేరు. దానిని నిర్ధారించాల్సింది పోలీసులు, మరి దుబాయ్ వైద్యులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయిందని ఎలా చెప్పగలిగారు?
* సాధారణంగా ఫోరెన్సిక్ రిపోర్టులో అక్షరదోషాలు ఉండకుండా జాగ్రత్తపడతారు. కానీ శ్రీదేవి విషయంలో ‘డ్రౌనింగ్’ అన్న పదం స్పెల్లింగ్ ను ‘డ్రావింగ్’ అని తప్పుగా ప్రచురించారు. నిర్లక్ష్యమా? ఎవరైనా చెప్పిన విధంగా రాశారా?
* బాత్రూంలో ఎవరైనా తూలి బాత్ టబ్ లో పడిపోతే తలకు లేదా మరేదైనా ప్రాంతంలో బలమైన గాయాలవుతాయి. శ్రీదేవి శరీరంలో అలాంటి గాయాల ఆనవాళ్లున్నాయా? వాటినెందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వెల్లడించలేదు?
* అపస్మారక స్థితిలో ఆమె బాత్రూంకి ఎలా వెళ్లగలిగారు?
* బాత్ టబ్ లో పడి ఒక మనిషి మరణించడం సాధ్యమా?