Sridevi: శ్రీదేవి చివరి కోరిక మేర అంతిమయాత్రలో తెల్లని పూలు?
- శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట
- అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు ఆ రంగువే వినియోగిస్తారట
- రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీదేవి అంత్యక్రియలు
తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో...
'ఆఖరిపోరాటం' సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి ఈ పాటలో తెల్లని వస్త్రాలలో మెరిసిపోతూ వుంటుంది. ఆ పాటలో వర్ణించినట్టే శ్రీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టమట. అందుకే, తన అంతిమ యాత్రకు సంబంధించిందంతా తెలుపు రంగులో ఉండాలన్నదే శ్రీదేవి ఆకాంక్ష అనే వార్త ఒకటి ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలో, ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు.. తెలుపు రంగువే వినియోగించనున్నట్టు తెలుస్తోంది. దీనికి బలాన్నిస్తూ, అనిల్ కపూర్ నివాసంలోకి తెల్లని పువ్వులతో నిండిన గంపలను తీసుకెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ రోజు రాత్రి పది గంటలకు శ్రీదేవి భౌతికకాయం భారత్ కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం పదకొండు గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరగనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.