pradeep kasni: నిజాయతీ పరుడైన ఐఏఎస్ కు ఘోర అవమానం!

  • నిజయతీపరుడైన ఐఏఎస్ గా పేరుతెచ్చుకున్న ప్రదీప్ కాస్నీ
  • నిజాయతీకి గుర్తు 34 ఏళ్ల సర్వీసు 71 ట్రాన్స్ ఫర్స్
  • మనుగడలో లేని బోర్డుకు ఆఫీసర్ గా నియామకం

నిజాయతీ పరుడికి ఇవి రోజులు కావన్న విషయాన్ని హర్యానా ప్రభుత్వం నిజం చేసి చూపించింది. దాని వివరాల్లోకి వెళ్తే... హర్యానాలోని ల్యాండ్ యూజ్ బోర్డు ఛైర్మన్ గా పని చేస్తూ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ప్రదీప్‌ కాస్నీకి అత్యంత నిజాయతీపరుడనే పేరుంది. 34 ఏళ్ల ఆయన కెరీర్ లో ఏనాడూ రాజీపడిన సందర్భమే లేదు. దీంతో ఆయనకు 71 సార్లు ట్రాన్స్ ఫర్ అయింది. చివరగా ఆరునెలల క్రితం ఆయనను ల్యాండ్‌ యూజ్‌ బోర్డుకు ప్రత్యేక ఆఫీసర్‌ గా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది.

దీంతో విధుల్లో చేరిన తరువాత ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదని, అధికారిక ఫైల్స్‌ ఏవీ కూడా తన కార్యాలయానికి చేరడం లేదని, ఉన్న ఫైళ్లు పెండింగ్‌ లో ఉన్నాయని ఆయన ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఆ బోర్డు 2008 నుంచే పనిచేయడం లేదని ప్రభుత్వం సమాధానమిచ్చింది.

దీంతో నిర్ఘాంతపోయిన ఆయన, ఇన్నాళ్లు మనుగడలో లేని బోర్డు బాధ్యతలు తనకు ఇవ్వడంతోపాటు, ఆరు నెలలుగా జీతం చెల్లించకుండా పనిచేయించుకున్నారని, తన విలువైన సర్వీసును వృథా చేశారని, ఆ కాలాన్ని తన రిటైర్‌ మెంట్‌ తర్వాత కూడా కొనసాగించేలా చేయాలని డిమాండ్‌ చేస్తూ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News