diamond traders: పారిస్ మెట్రో స్టేషన్లో భారత వజ్రాల వ్యాపారులను నిలువునా దోచేసిన దుండగులు!
- పారిస్‌లో రెచ్చిపోతున్న హై-ప్రొఫైల్ వజ్రాల దొంగలు
- దోపిడీకి గురైన సొత్తు విలువ రూ.2.41 కోట్లు
- గతంలో నటి కిమ్ కిండర్సన్ను దోచేసిన దుండగులు
భారత వజ్రాల వ్యాపారులు ఇద్దరు పారిస్‌లో నిలువు దోపిడీకి గురయ్యారు. పారిస్ మెట్రో స్టేషన్లోకి ప్రవేశించగానే వారి వద్ద ఉన్న బ్యాగులను దుండుగుల అపహరించారు. అందులో దాదాపు రూ. 2.41 కోట్ల విలువైన రాళ్లు ఉన్నట్టు శుక్రవారం దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే వజ్రాలు మాత్రం చోరీకి గురికాలేదని పేర్కొన్నారు. దుండగులు ముందస్తు పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్టు అధికారులు పేర్కొన్నారు. పారిస్‌లోని సెంట్రల్ నైన్త్ అరోండిస్మెంట్లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. వజ్రాల వ్యాపారానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
పారిస్‌లో హై-ప్రొఫైల్ వజ్రాల దొంగలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరి సంఖ్య మరింత పెరిగింది. ఈ జనవరిలో రిట్జ్ హోటల్లో భారీ దోపిడీ జరిగింది. అక్టోబరు, 2016న ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు వచ్చిన యూఎస్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కిండర్సన్ కాళ్లు, చేతులు కట్టేసి కణతకు తుపాకి గురిపెట్టి 9 మిలియన్ యూరోల విలువైన వజ్రాభరణాలను దోచుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.