Jayaprakash Narayan: రాజధాని నిర్మాణానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే: జేఎఫ్‌సీ నివేదిక వివరాలు చెప్పిన జేపీ

  • కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దాదాపు 75 వేల కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంది
  • ప్రత్యేకహోదా అంశంపై అనేక మాటలు మాట్లాడుతున్నారు
  • 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉంది
  • ఏపీకి కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సాయంపై నివేదిక రూపొందించడానికి కృషి చేసిన జేఎఫ్‌సీ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని అభినందిస్తున్నానని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేఎఫ్‌సీ రూపొందించిన నివేదికలోని అంశాలను చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతోన్న విషయాల్లో క‌చ్చితంగా ఖండించ‌వ‌ల‌సిన కొన్ని అంశాలు ఉన్నాయని అన్నారు. కోర్టులు, ప్ర‌భుత్వాల్లా సుదీర్ఘ స‌మ‌యం తీసుకుని పరిశోధనలు చేసి తాము వివరించలేమని అన్నారు. ఈ పది రోజుల్లో జేఎఫ్‌సీ చేసిన కృషి ఫలితంగా తమకు లభించిన సమాచారం అధారంగా వివరాలు చెబుతున్నామని, అంతేగానీ ప‌రిపూర్ణంగా సమాచారం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దాదాపు 75 వేల కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉందని తమకు తెలిసిందని అన్నారు. కచ్చితంగా చెప్పాలంటే రూ.74,542 కోట్లు రావాల్సి ఉందని అన్నారు.

ప్రత్యేకహోదా అంశంపై అనేక మాటలు మాట్లాడుతున్నారని, 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందని అన్నారు. ఏపీకి కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని అన్నారు. అలాగే, వెనకబడిన 7 జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి సాయం చేసే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. రాజధానిలో మౌలిక వసతులు, రహదారులు, రైళ్ల సదుపాయానికి కేంద్రం నుంచి సాయం అందాలని అన్నారు. దుగరాజ పట్నం పోర్టు పట్ల అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రం ప్రభుత్వాం రెండూ ఉదాసీనంగా ఉన్నాయని తెలిపారు.  

  • Loading...

More Telugu News