Om Prakash Mitharval: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ : భారత షూటర్ ప్రపంచ రికార్డ్
- పదిమీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో ప్రపంచకప్ రికార్డు
- ఇదే ఈవెంట్లో జితూ రాయ్కి కాంస్యం
- పురుషుల వలే రాణించిన మహిళా షూటర్లు
మెక్సికోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ పోటీల్లో భారత యువ షూటర్ షాజర్ రిజ్వీ మెరిశాడు. తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించాడు. బంగారు పతకంతో పాటు ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పి శభాష్ అనిపించుకున్నాడు. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అతను ఈ ఘనత సాధించాడు. శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఈ పోటీలో రిజ్వీ మొత్తం 242.3 పాయింట్లు సాధించి తన ప్రత్యర్థి క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ)పై గెలుపొందాడు.
మరో భారత షూటర్ జితూ రాయ్ కూడా ఇదే ఈవెంట్లో 219 పాయింట్లు చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మరో భారత షూటర్ ఓమ్ ప్రకాశ్ మిథర్వాల్ 198.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక మహిళా క్రీడాకారిణుల విషయానికొస్తే, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మెహులి ఘోష్ 228.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనదేశానికి చెందిన ఇతర మహిళా షూటర్లు అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చండేలా కూడా రాణించారు.