china: మా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోం: అమెరికాకు చైనా హెచ్చరిక
- అవసరమైన చర్యలు తీసుకుంటాం
- అమెరికాతో వాణిజ్య పోరును కోరుకోవడం లేదు
- చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకటన
మా ఆర్థిక ప్రయోజనాలను అమెరికా దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని చైనా హెచ్చరించింది. అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా పన్ను వేయనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీంతో చైనా నేషనల్ పీపుల్స్ క్రాంగెస్ అధికార ప్రతినిధి జాంగ్ యేష్యూ స్పందిస్తూ ‘‘చైనా అమెరికాతో వాణిజ్య పోరును కోరుకోవడం లేదు. ఒకవేళ అమెరికా చర్యలు చైనా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ కూర్చోకుండా చైనా అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని జాంగ్ చెప్పారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్థిక సలహాదారు లీహీ వైట్ హౌస్ లో అమెరికా అధికారులతో భేటీ అయి ఆర్థిక సంబంధాలపై చర్చలు జరిపారు.