China: రక్షణ రంగానికి భారీ నిధులు కేటాయించిన చైనా!

  • గతేడాది అత్యధికంగా 150.5 బిలియన్ డాలర్లు రక్షణ రంగానికి కేటాయించిన చైనా
  • ఈ ఏడాది 175 బిలియన్ డాలర్లు కేటాయించిన చైనా
  • అమెరికా తరువాత రక్షణ రంగానికి ఎక్కువ కేటాయిస్తున్న చైనా

రక్షణ రంగానికి చైనా అధిక ప్రాధాన్యతనిస్తోంది. విపరీతంగా బడ్జెట్టును కేటాయిస్తోంది. ఎంతగా అంటే, భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ ను చైనా రక్షణ రంగానికి కేటాయించింది. అంతకు ముందు కంటే ఏడు శాతం బడ్జెట్ ను పెంచుతూ గతేడాది 150.5 బిలియన్ డాలర్లను రక్షణ రంగానికి కేటాయించిన చైనా, ఈ ఏడాది దానికి 8.1 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది చైనా రక్షణ రంగానికి 175 బిలియన్‌ డాలర్లను కేటాయించినట్లు తెలిపింది.

ప్రపంచంలో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనా కావడం విశేషం. అమెరికా రక్షణ బడ్జెట్‌ 602.8 బిలియన్‌ డాలర్లు కాగా, చైనా రక్షణ బడ్జెట్ 175 బిలియన్ డాలర్లు. భారత రక్షణ బడ్జెట్ 52.5 బిలియన్‌ డాలర్లు కావడం విశేషం. మిలిటరీ ఎక్విప్‌ మెంట్‌ అప్‌ గ్రేడ్‌ చేయడానికి, సైనికులు, మహిళల సంక్షేమం, కిందిస్థాయి దళాల నివాస, శిక్షణ పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఏడాది బడ్జెట్‌ ను పెంచినట్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. చైనా నావికాదళంలో ఇప్పటికే ఒక విమానవాహక నౌక సేవలందిస్తుండగా, మరో రెండు అత్యాధునిక విమాన వాహక నౌకలను తయారుచేస్తోంది. అలాగే కొత్త జే-20 యుద్ధ విమానాలు సహా మరికొన్ని కొత్త జెట్‌ లను తయారు చేస్తోంది. 

  • Loading...

More Telugu News