Chandrababu: వైకాపా లేదని ఆషామాషీగా తీసుకోవద్దు: మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక!
- ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలి
- ఎవరూ ప్రైవేటు కార్యక్రమాలు పెట్టుకోవద్దు
- ఎమ్మెల్యేల హాజరు బాధ్యత ఇన్ చార్జ్ మంత్రులదే
- స్పష్టం చేసిన చంద్రబాబు
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలం మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యమూ తనకు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ జరుగుతుంటే విధిగా హాజరు కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ సభ్యులు సభలో లేకున్నా సభా కార్యకలాపాలను అలక్ష్యం చేయవద్దని, ఎమ్మెల్యేలు ఎవరూ ప్రైవేటు కార్యక్రమాలను పెట్టుకోరాదని ఈ ఉదయం ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులకు అప్పగించిన చంద్రబాబు, సభలో మాట్లాడేటప్పుడు ఎవరైనా పూర్తి అవగాహనతోనే మాట్లాడాలని, ఒక్క తప్పు మాట కూడా వారి నోటి నుంచి రారాదని సూచించారు.