Andhra Pradesh: ఏఈబీఏఎస్ అంశాలపై ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్
- ఈ సమావేశంలో పాల్గొన్న హైదరాబాదు ఎన్ఐసీ నుండి ప్రభుత్వ ఐటి సలహాదారు, ఏపీ సీఎస్
- ఈ - నిధి, ఈ - ఆఫీస్, ఏఈబీఏఎస్ లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు
- రాష్ట్ర స్థాయి అధికారులకు తగు సూచనలు చేసిన వైనం
ఈ - నిధి, ఈ - ఆఫీస్, ఆధార్ ఎనెబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)అంశాలపై ఢిల్లీ నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) డిప్యూటీ డెరెక్టర్ జనరల్ ఇన్ చార్జి రచన శ్రీవాస్తవ నిర్వహించిన ఈ సమావేశంలో హైదారాబాదు ఎన్ఐసీ నుండి ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ - నిధి, ఈ - ఆఫీస్, ఏఈబీఏఎస్ లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ వివరించారు.
ముఖ్యంగా సచివాలయంలోని వివిధ శాఖలవారీగా కోడ్ లు కేటాయించడం జరిగిందని అలాగే శాఖాధిపతులకు, అటానమస్ ఆర్గనైజేషన్లకు, సర్వీసులకు, హెడ్ ఆఫీస్ లకు, ఆఫీస్ లకు, పోస్టు కేటగిరీ కోడ్స్,లొకేషన్ కోడ్స్, సుమారు 188 సర్వీసులకు కోడింగ్ ఇవ్వడం జరిగిందని వాటిని ఇ-ఆఫీస్ కింద ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ - నిధి, ఈ - ఆఫీస్, ఏఈబీఏఎస్ అంశాలకు సంబంధించిన వివిధ సాంకేతికపరమైన విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులకు తగు సూచనలు అందించారు.