kcr: థర్డ్ ఫ్రంట్ నాటకాలు కూడా మోదీకి లబ్ధి చేకూర్చేందుకే: కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి విమర్శ
- సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్
- తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది
- దేశ రాజకీయాల్లో మార్పు గురించి కేసీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు
- కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన మర్రి శశిధర్ రెడ్డి
కేసీఆర్ చేసిన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని, థర్డ్ ఫ్రంట్ నాటకాలు కూడా మోదీకి లబ్ధి చేకూర్చేందుకేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనపై ఉన్న కేసుల భయంతోనే ఈ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు, జీఎస్టీ అమలుకు, పెద్దనోట్ల రద్దుకు మద్దతు తెలిపారని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్, దేశ రాజకీయాల్లో మార్పు గురించి మాట్లాడటం, దిశా నిర్దేశం చేస్తాననడం సిగ్గుచేటని శశిధర్ రెడ్డి విమర్శించారు.