theatres: చర్చలు విఫలం.. ఈ నెల 9 వరకు కొనసాగనున్న థియేటర్ల బంద్‌

  • డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా బంద్
  • ఈ రోజు మరోసారి చర్చలు జరిపిన నిర్మాతలు, సర్వీస్‌ ప్రొవైడర్లు
  • సర్వీస్‌ ప్రొవైడర్ల హామీపై కుదరని ఏకాభిప్రాయం

డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా టాలీవుడ్ నిర్మాతలు ఈ నెల 2 నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు ఖాళీగా కనపడుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, నిర్మాతల మధ్య ఈ రోజు చర్చలు జరిగాయి. వీపీఎఫ్‌ 16 శాతం తగ్గిస్తామని సర్వీస్‌ ప్రొవైడర్లు చెప్పగా, ఈ హామీపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 9 వరకు థియేటర్ల బంద్‌ కొనసాగిస్తామని నిర్మాతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సుమారు 1700 థియేటర్లు సినిమాలను ప్రదర్శించడం లేదు.  

  • Loading...

More Telugu News