AMERICA: దక్షిణకొరియాతో ఉత్తరకొరియా అధ్యక్షుడి శాంతి చర్చలు సఫలం.. అణు పరీక్షలు ఆపేస్తానని చెప్పిన కిమ్
- అమెరికాతోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన కిమ్
- వచ్చే నెలలో ఉత్తరకొరియా, దక్షిణాకొరియాల సంయుక్త సదస్సు
- దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జేను కలవనున్న కిమ్ జాంగ్ ఉన్
- ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకునేలా హాట్‌లైన్ కూడా ఏర్పాటు
యుద్ధానికి రెచ్చగొట్టే విధంగా వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కలకలం రేపుతోన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం శాంతి వైపుగా పయనిస్తున్నాడు. దక్షిణ కొరియాతో ఆయన స్వయంగా చర్చలు జరిపారు. కిమ్‌తో చర్చించేందుకు దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ప్రతినిధులు వెళ్లారు. వారి మధ్య చర్చలు ఫలించాయని సియోల్ వర్గాలు తెలిపాయి. తాము ఇక అణు పరీక్షలు నిర్వహించబోనని కిమ్ జాంగ్ ఉన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
అంతేకాదు, అమెరికాతో చర్చలకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు కిమ్ చెప్పారని సియోల్ మీడియా పేర్కొంది. వచ్చే నెలలో ఉత్తరకొరియా, దక్షిణాకొరియాలు ఓ సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ సదస్సులో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జేను కిమ్ జాంగ్ ఉన్ తొలిసారి కలవనున్నారు. ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకునేలా హాట్‌లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.