ambedkar: మరో కలకలం.. యూపీలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఆందోళనకారులు.. ఉద్రిక్తత
- కలకలం రేపుతోన్న విగ్రహాల కూల్చివేత
- ఇటీవలే దేశంలోని పలు ప్రాంతాల్లో లెనిన్, పెరియార్, శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాల ధ్వంసం
- ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై దళితుల ఆందోళన
దేశంలోని పలు ప్రాంతాల్లో కొందరు ఆందోళనకారులు ప్రముఖుల విగ్రహాలను కూల్చి వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చి వేసిన అనంతరం తమిళనాడులో వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్ విగ్రహాలను కొందరు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ రోజు కూడా విగ్రహాల కూల్చివేత జరగడం కలకలం రేపుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయంపై స్పందించి హెచ్చరించినప్పటికీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేశారు. ఈ దారుణ ఘటనపై దళితులు ఆందోళనలకు దిగి, రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.