Chandrababu: కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయిద్దాం: చంద్రబాబుకి చెప్పిన నేతలు

  • భేటీలో పాల్గొన్న ఎంపీలు, రాష్ట్ర మంత్రులు
  • కేంద్ర మంత్రులు నిరసన తెలిపేలా పోరు ఉద్ధృతం చేయాలని కొందరి సూచన
  • తాము తీసుకున్న నిర్ణయాన్ని భేటీ తరువాత ప్రకటించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, సాయం మాత్రమే చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి పాత పాటే పాడడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నేతలతో అమరావతిలో సచివాలయంలో అత్యవసరంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ భేటీలో ఏపీ మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నారాయణ కూడా పాల్గొంటున్నారు.  

తొలి అడుగుగా తమ ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిద్దామని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించారు. కేంద్ర మంత్రులు నిరసన తెలిపేలా పోరు ఉద్ధృతం చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఈ భేటీ తరువాత ప్రకటించనున్నారు. 

@
  • Loading...

More Telugu News