central government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు!
- కేంద్ర ఉద్యోగులు, పింఛన్ దారులకు 2 శాతం డీఏ పెంపు
- ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి
- డీఏ పెంపు నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (డియర్ నెస్ అలవెన్స్) ని రెండు శాతం పెంచింది, ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ పింఛన్ దారులకు కూడా డీఏ ను 2 శాతం పెంచేందుకు ఆమోదించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది.
కాగా, డీఏ పెంపు నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల భారం పడనుండగా, 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61.17 లక్షల మంది పింఛన్ దారులకు లబ్ధి చేకూరనుంది.