Nayan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తెలుగులోకి నయనతార హిట్ తమిళ మూవీ 
  • కేరేమ్స్ ఆటగాడిగా వస్తున్న ధనుష్
  • కమలహాసన్ చిత్రంలో నితిన్?

*  నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'ఆరాం' పలువురి ప్రశంసలు పొందింది. నయన్ అభినయానికి సర్వత్ర అభినందనలు కురిశాయి. ఇప్పుడీ చిత్రాన్ని 'కర్తవ్యం' పేరిట తెలుగులోకి అనువదించారు. దీనిని ఈ నెల 16న రిలీజ్ చేస్తున్నారు.
*  తమిళ కథానాయకుడు ధనుష్ జాతీయ కేరేమ్స్ ఆటగాడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఇలా కేరేమ్స్ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  కమలహాసన్ నిర్మించే చిత్రంలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తున్న కమల్ నిర్మించే తదుపరి చిత్రంలో నితిన్ నటిస్తాడట. మరో హీరో విక్రం కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడమే కాకుండా, ఇందులో ఓ పాత్ర కూడా పోషిస్తాడట. 

  • Loading...

More Telugu News