Jaya Bachchan: రాజ్యసభ ఎన్నికల బరిలోకి అమితాబ్ సతీమణి.. ఎస్పీ అభ్యర్థిగా జయాబచ్చన్?
- చక్కర్లు కొడుతున్న జయా బచ్చన్ పేరు
- బీఎస్పీ అభ్యర్థిగా భీమ్‌రావ్ అంబేద్కర్
- ఎస్పీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి అన్న అమర్‌సింగ్
అమితాబ్ సతీమణి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరపున తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జయా బచ్చన్ 2012లో మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్ మాట్లాడుతూ జయాబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీకి చాలా విశ్వసనీయమైన వ్యక్తి అని, ఆమె మంచి నాయకురాలిగా నిరూపించుకున్నారని అన్నారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి తమ అభ్యర్థిగా అత్యంత నమ్మకస్తుడైన భీమ్‌రావ్ అంబేద్కర్ పేరును ప్రకటించారు. పార్టీ బేరర్లతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం అంబేద్కర్ పేరును మాయావతి ప్రకటించారు.