ap budget: ఏపీ 2018-19 బడ్జెట్.. వివరాలు-1
- రాష్ట్ర బడ్జెట్ - రూ. 1,91,063.61 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా - రూ. 24,205.21 కోట్లు
- సంక్షేమ రంగానికి పెద్ద పీట
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని చెప్పారు. 10.96 శాతం వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు అందక చాలా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు...
- రాష్ట్ర బడ్జెట్ - రూ. 1,91,063.61 కోట్లు
- కేపిటల్ వ్యయం అంచనా - రూ. 28,678.49 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా - రూ. 24,205.21 కోట్లు
- వ్యవసాయ రంగానికి - రూ. 12,355.32 కోట్లు
- సాగునీటి రంగానికి - రూ. 16,978.23 కోట్లు
- ఇంధన రంగానికి - రూ. 5,052.54 కోట్లు
- సంక్షేమ రంగానికి - రూ. 13,720 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి - రూ. 20,815.98 కోట్లు
- మత్స్యకారుల అభివృద్ధికి - రూ. 77 కోట్లు
- న్యాయశాఖకు - రూ. 886 కోట్లు
- విద్యాశాఖకు - రూ. 24,185 కోట్లు
- సాంకేతిక విద్యకు - రూ. 818 కోట్లు