jharkhand: సి అంటే చోర్... జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చెబుతున్న పాఠాలు... వీడియో చూస్తే తెల్లబోవాల్సిందే!

  • జవహర్ లాలూ నెహ్రూ అంటే చోరులకు ప్రధాని అని...
  • బ్రాహ్మణులు అంటే మూర్ఖులు అని...
  • అమాయక చిన్నారులకు టీచర్ తప్పుడు బోధనలు

జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కట్టే కథనాన్ని ప్రముఖ జాతీయ మీడియా జీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. ఎ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్ అని చెప్పడం విన్నాం. కానీ, జార్ఖండ్ రాష్ట్రంలోని కుతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సి ఫర్ అంటే పిల్లలకు ఏం చెబుతున్నారో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.

సి అంటే చోర్ (దొంగ) అని, చాచా నెహ్రూ (దేశ మాజీ ప్రధాని) చోర్ లకు ప్రధానమంత్రి అని అక్కడి టీచర్ బోర్డుపై రాసి పిల్లలకు చెప్పడం, ఏమీ తెలియని చిన్నారి విద్యార్థులు టీచర్ చెప్పినట్టు తిరిగి అప్పజెప్పడాన్ని వీడియోలో వినొచ్చు. బ్రాహ్మిణ్స్ అంటే బూర్బక్ (మూర్ఖులు) అని ఆ టీచర్ పలికించడం గమనించొచ్చు.

అయితే, ఈ పాఠాల గురించి తమకు తెలియదని, దీనిపై విచారణ జరుపుతామని విద్యా శాఖాధికారులు చెప్పడం ఆశ్చర్యకరం. జార్ఖండ్, బిహార్, యూపీ రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువులకు పాఠ్యాంశాలపై కనీస అవగాహన కూడా లేదని ఎన్నో సార్లు రుజువైన విషయమే.

  • Loading...

More Telugu News