prashanth varma: అలాంటి అవమానాలు తట్టుకోలేకపోయేవాడిని: 'అ!' దర్శకుడు ప్రశాంత్ వర్మ
- అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకున్నాను
- ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరిగాను
- అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి
ఈ మధ్య కాలంలో కొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి మార్కులు కొట్టేసిన దర్శకులలో 'అ!" దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒకరిగా కనిపిస్తాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో తనకి ఎదురైన కొన్ని అవమానాలను గురించి ప్రస్తావించాడు. " ఇంజనీరింగ్ చదువుతోన్న సమయంలోనే నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ .. మ్యూజిక్ వీడియోస్ .. డాక్యుమెంటరీస్ చేశాను" అన్నాడు.
"నాకు గుర్తింపుగా వచ్చిన సర్టిఫికెట్స్ ను పట్టుకుని వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వమని అడిగేవాడిని. నువ్ ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలా కాదని చెప్పేసి సిఫార్స్ తో ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన ''ఒరేయ్ .. వెళ్లి వాటర్ తీసుకురారా" అన్నారు. నేను ఆఫీస్ బాయ్ కోసం చూస్తుంటే .. 'నిన్నేరా' అన్నాడు. ఆ పని చేయడం ఇష్టంలేక .. ఇంటికి వచ్చేశా. మరో దర్శకుడి ఆఫీస్ లో నేను దూరంగా నుంచుని ఉన్నప్పటికీ .. 'ఇక్కడ నీకేం పనిరా' అంటూ బూతులు తిట్టారు అంటూ చెప్పుకొచ్చాడు.