GodavariUS: ప్రెస్ నోట్: “కిరాక్” పేరుతో తన కొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టిన గోదావరి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ బ్రాండ్ గోదావరి పక్కా స్థానికతతో “కిరాక్”పేరుతో తన నూతన బ్రాండ్‌ను మన ముందుకు తీసుకువస్తోంది. ‘డౌన్ టౌన్ మార్కెట్’లోకి విస్తరిస్తున్న గోదావరి ఈ క్రమంలో అద్భుతమైన మెనూ, ఆకట్టుకునే విభిన్న రుచి కలిగిన వంటకాలతో వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. (KIRAAAK - New Restaurant brand from Godavari).
యూటాలోని సాల్ట్ లేక్ సిటీ డౌన్ టౌన్‌లో ప్రారంభించిన మొదటి ఔట్‌లెట్‌కు వినియోగదారుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. గోదావరి గ్రూప్ నుంచి ప్రవేశపెట్టిన ఈ వినూత్నమైన మెనూకు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ దక్కుతోంది. ఆ కొత్త రుచులను వారు విశేషంగా ఆస్వాదిస్తున్నారు.
“మోడర్న్ సౌత్ ఇండియన్ ఫుడ్” (Modern South Indian Food) అనే ట్యాగ్ లైన్ తో తీర్చిదిద్దిన కిరాక్ అనేక విశిష్టమైన రుచులకు కేంద్రంగా నిలుస్తోంది. “చికెన్ విత్ ది స్కర్ట్”, “రమ్ చాప్స్” సహా మరెన్నో వంటకాలను కిరాక్ అందిస్తోంది.
యూటా రీజియన్‌లో ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు సుప్రసిద్ధ వ్యాపారవేత్తగా పేరున్న డాక్టర్ ప్రసాద్ రెడ్డి (“కిరాక్” రెస్టారెంట్ యజమాని) ఈ సందర్భంగా మాట్లాడుతూ “మా మొట్టమొదటి సమావేశంలోనే “టీంగోదావరి” బృందం తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ బృందంలోని యువకులకు మన వంటకాలు, ఆతిథ్యం పట్ల ఉన్న తపన, ప్రత్యేక శ్రద్ధ, వారి విజన్ నన్ను ఆశ్చర్యానికి లోను చేశాయి. వివిధ మార్కెట్ అవకాశాల పట్ల వారికి ఉన్న స్పష్టత నన్ను మైమరపించింది. అందుకే సాల్ట్ లేక్‌లో మొదటి కేంద్రం ఏర్పాటు చేశాం” అని తన హర్షం వ్యక్తం చేశారు.
సాల్ట్ లేక్ సిటీ ప్రామాణికం మరియు రుచికరమైన దక్షిణభారతీయ వంటకాలను ఆస్వాదించే అవకాశాన్నికోల్పోయిందని డాక్టర్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “అందుకే మేం డౌన్ టౌన్ ప్రాంతానికి ఓ ప్రత్యేకమైన ఆహార అనుభూతులను అందించాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా ప్రఖ్యాత గోదావరి బ్రాండ్‌లో భాగమైనకిరాక్‌ను ప్రారంభించాం (Best South Indian restaurant in Salt Lake City, Utah).”
“టీం గోదావరి వద్ద ఇలాంటి ఇంకెన్నో ప్ర్తత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. దక్షిణాది వంటకాల రుచులను అందిస్తూ ఈబృందం చేసే ప్రయాణం సుదీర్ఘకాలంలో తనదైన ముద్రను వేసుకుంటూ విజయతీరాలకు చేరుతుందనే బలమైన విశ్వాసం నాకు ఉంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
“కిరాక్ అనే పదానికి ఉన్న విశిష్టమైన అర్థం `అద్భుతం`. కిరాక్ ఆలోచన తీరు, వారు అందిస్తున్న వంటకాలు నాకెంతో నచ్చాయి” అని స్థానిక వాసి అయిన రోజర్ ఫ్రాంక్ తన బఫెట్ పూర్తయిన అనంతరం సంతోషంతో వ్యక్తం చేశారు.
అందుకే గోదావరి, కిరాక్‌కు కిరాక్ చెప్పేయండి…
కిరాక్
214 W 600 S సూట్ A,
సాల్ట్ లేక్ సిటీ, యూటా 84101, యూఎస్ఏ.
KIRAAAK
214 W 600 S Suite A,
Salt Lake City, UT 84101, USA.
మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండిః
వరుణ్ మేడిశెట్టి
630-340-9760
మరోమారు మీ అందరికీ కృతజ్ఞతలు…
Press release by: Indian Clicks, LLC