USA: అమెరికాలో నీట మునిగి తెలుగు విద్యార్థి దుర్మరణం

  • నార్త్‌ కరోలినాలో ఘోరం
  • బోటింగ్ కు వెళ్లిన వేళ విషాదం
  • నీటీలో పడిపోయిన ఇద్దరు
  • ఒకరి మృతి, తప్పించుకున్న మరొకరు
కాసేపు సేదదీరేందుకు బోటింగ్ కు వెళ్దామని భావించిన ఓ తెలుగు విద్యార్థి అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. యూఎస్ లోని ఉత్తర కరోలినాలో జరిగిన ఘటన గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవినేని రాహుల్‌ (19) తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం రాహుల్, తన ఫ్రెండ్స్ తో కలసి వ్యాహ్యాళి నిమిత్తం ఓ సరస్సు వద్దకు వెళ్లాడు. సరదాగా బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదశావత్తు పడవ మునిగిపోయింది. రాహుల్‌ తో పాటు అతని ఫ్రెండ్ కూడా నదిలో పడిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు, ఇద్దరినీ బయటకు తీసి దగ్గర్లోనే ఉన్న ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాహుల్‌ మృతిచెందాడు. అతని స్నేహితుడు మాత్రం స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం వెలువడాల్సి వుంది.
USA
water
Death
North Carolina
Telugu Student

More Telugu News