nani: నేను హీరోను కావాలనుకోలేదు .. కానీ అయ్యాను: నాని
- అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను
- దర్శకుడిని కావాలనేది నా ఆలోచన
- ఆ సమయంలోనే 'అష్టాచమ్మా'లో ఛాన్స్ వచ్చింది
కథను ఎంపిక చేసుకోవడంలోను .. ఆ కథ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనే విషయంలోను నానికి మంచి అవగాహన వుంది. అందువల్లనే ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా .. ఓవర్సీస్ లోను భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాని మాట్లాడుతూ .. "నేను 'బాపు' గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ తరువాత దర్శకుడిగా కెరియర్ ను కొనసాగించాలనేది నా ఆలోచన.
కానీ అనుకోకుండా 'అష్టా చమ్మా' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలోనే నేను ఆలోచనలో పడ్డాను .. ఏ నిర్ణయాన్ని తీసుకోలేక అయోమయంలో పడిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నిర్మాత సురేశ్ బాబుగారితో పాటు మరికొందరు, హీరోగా చేయమంటూ నన్ను ప్రోత్సహించారు. దర్శకుడివి ఎప్పుడైనా కావొచ్చు .. హీరోగా వచ్చిన ఛాన్సును వదులుకోవద్దని సూచించారు. అలా హీరోగా మారిన నేను .. ఈ రోజున ఇన్ని సక్సెస్ లు అందుకోవడం ఆనందంగానూ .. ఆశ్చర్యంగాను వుంది " అంటూ చెప్పుకొచ్చాడు.