Special Public Prosecutor: 2జీ కేసులో కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు...దర్యాప్తు ముగింపుకు ఆరు నెలల గడువు

  • 2జీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సుప్రీం ధర్మాసనం సీరియస్
  • ఆరు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐ, ఈడీలకు హుకుం
  • రెండు వారాల్లోగా స్టేటస్ నివేదిక సమర్పించాలని కేంద్రానికి ఆదేశం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన కేసుల దర్యాప్తులో జాప్యానికి కేంద్రంపై సుప్రీంకోర్టు ఈ రోజు సీరియస్ అయింది. దర్యాప్తును ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం సహా 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో పాటు దానికి సంబంధించిన కేసుల దర్యాప్తు తాలూకూ పురోగతి (స్టేటస్) నివేదికను  రెండు వారాల్లోగా సమర్పించాలని అరుణ్ మిశ్రా, నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2జీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో దేశ ప్రజలను మభ్యపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మరోవైపు 2014లో ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తాను నియమించిన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్‌ని కూడా ఆ బాధ్యత నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్రం సిఫారసు చేసిన అడిషినల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నియామకానికి అంగీకరించింది.

  • Loading...

More Telugu News