India: ఆయుధ దిగుమతుల్లో మనమే టాప్.. తర్వాతే ఎవరైనా!
- 24 శాతం పెరిగిన భారత్ ఆయుధాల దిగుమతి
- తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా, ఈజిప్ట్
- అత్యధికంగా రష్యా నుంచే కొనుగోళ్లు
ఆయుధ దిగుమతుల్లో భారత్ రికార్డు సృష్టించింది. ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2008-2012, 2013-2017 మధ్య కాలంలో ఆయుధ దిగుమతులు ఏకంగా 24 శాతం పెరిగాయి. భారత్ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, చైనా, ఆస్ట్రేలియా, అల్జీరియా, ఇరాక్, పాకిస్థాన్, ఇండోనేషియాలు నిలిచాయి. 2013-17లో రష్యా నుంచి భారత్‌కు అత్యధికంగా (62 శాతం) ఆయుధాలు దిగుమతి కాగా, అమెరికా నుంచి 15 శాతం, ఇజ్రాయెల్ నుంచి 11 శాతం ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకుంది. స్టాక్‌హోమ్‌లోని గ్లోబల్ థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సోమవారం ఈ వివరాలను విడుదల చేసింది.