Congress: జానారెడ్డి, గీతారెడ్డి సహా... 11 మంది కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు
- 11 మందిపై వేటుకు హరీశ్ రావు తీర్మానం
- ఆమోదించిన సభ
- నిన్నటి ఘటనలు దురదృష్టకరమన్న స్పీకర్
అనుకున్నట్టుగానే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాగానే, నిన్న జరిగిన చర్య దుర్మార్గమైనది, హేయమైనదని అభివర్ణించిన స్పీకర్ మధుసూదనాచారి, తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావుకు ఇచ్చారు. ఆపై హరీశ్ మాట్లాడుతూ, జానారెడ్డి, జీవన్ రెడ్డి, డాక్టర్ జే గీతారెడ్డి, జీ చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, ఎన్ పద్మావతి రెడ్డి, టీ రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డిలను ఈ సెషన్ ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆపై దీన్ని వెంటనే సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.