jayasudha: నాకు అస్సలు నోరు తిరగలేదు .. ఎన్టీఆర్ ఇబ్బంది పడిపోయారు: జయసుధ

  • ఎన్టీఆర్ సరసన లక్ష్మీదేవి పాత్ర చేశాను 
  • ఆ పాత్రలో డైలాగ్స్ చెప్పలేకపోయాను 
  • అమ్మవారిలా నుంచోలేకపోయాను       

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులతో నటించి మెప్పించిన కథానాయిక జయసుధ. సహజనటిగా ఆమెను అంతా ఎంతగానో అభిమానిస్తూ వుంటారు. అలాంటి జయసుధ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో చేసిన ఒక సినిమాను గురించి ప్రస్తావించారు. " ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం'లో లక్ష్మీదేవిగాను ..బీబీ నాంచారిగాను నటించాను".

"ఈ పాత్రలను నాతో చేయించడానికి రామారావుగారు ఎంతగానో అవస్థపడ్డారు. లక్ష్మి పాత్రలో చెప్పే డైలాగ్ ఒక్కటి కూడా నాకు నోరు తిరగలేదు .. ఆ భాష పలకలేకపోయేదానిని. ఒత్తులు అవసరమైన చోట పెట్టే దానిని కాదు. దాంతో 'ఏం జయసుధ ఏం భాషమ్మా ఇది .. తెలుగమ్మా .. తెలుగు' అని రామారావుగారు అనేవారు. ఇక నాకు లక్ష్మీదేవిలా నుంచోవడం కూడా వచ్చేది కాదు .. చేతులను ఉంచే ముద్ర అస్సలు కుదిరేది కాదు .. అలా కాదు ఇలా అని ఎన్టీఆర్ గారు సరిచేసేవారు. ఈ సినిమాలో భాషను సరిగ్గా పలకలేకపోవడం వలన నాకు డబ్బింగ్ చెప్పించారు. ఇక అప్పటి నుంచి 'స్వామి .. ఇచట .. అచట' అనే డైలాగ్స్ వుండే సినిమాలు చేయనని ముందుగానే చెప్పేసే దానిని" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News