USA: రష్యాతో ట్రంప్ కుమ్మక్కు కాలేదు: రిపబ్లికన్లు

  • ట్రంప్ కు పుతిన్ సాయంపై రిపబ్లికన్ పార్టీ నిఘా వ్యవహారాల సభాసంఘం నివేదిక తయారు
  • ట్రంప్ కార్యవర్గంతో రష్యా కుమ్మక్కైందనేందుకు సరైన ఆధారాలు లేవు
  • ట్రంప్ కు అనుకూలంగా పుతిన్ ప్రభుత్వం పనిచేసిందనే వాదన సరైంది కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రిపబ్లికన్ పార్టీ సభ్యులు క్లీన్ చిట్ ఇచ్చే ముసాయిదా నివేదిక సిద్ధం చేశారు. పదవి చేపట్టిన నాటి నుంచి రష్యా సాయంతో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రిపబ్లికన్ పార్టీ నిఘావ్యవహారాలకు సంబంధించిన సభా సంఘం ముసాయిదా నివేదిక రూపొందించింది. ఇందులో అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి ఉపకరించేలా రష్యా జోక్యం చేసుకుందనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సభా సంఘం స్పష్టం చేసింది. ట్రంప్ కు అనుకూలంగా పుతిన్ ప్రభుత్వం పనిచేసిందన్న వాదనను సభా సంఘం కొట్టిపడేసింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చేందుకు సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నివేదికను ట్రంప్ స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. కాగా, దీనికి పూర్తి భిన్నమైన వాదనతో ప్రతిపక్ష డెమోక్రాట్లు మరొక నివేదిక రూపొందించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News