ntr: 'సింహాద్రి' కథ .. బాలకృష్ణ కోసం తయారు చేసింది: పరుచూరి గోపాలకృష్ణ
- 'సింహాద్రి' కథ బాలకృష్ణకి నచ్చింది
- ఆ తరువాత ఆయన మనసు మార్చుకున్నారు
- దాంతో ఎన్టీఆర్ హీరోగా అది తెరపైకి వచ్చింది
ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో 'సింహాద్రి' ఒకటిగా కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ హీరోగా ఎన్టీఆర్ స్థాయిని పెంచింది. అలాంటి ఈ సినిమాను గురించి, 'పరుచూరి పలుకులు'లో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. " 'సింహాద్రి' సినిమాలోను మాకో చిన్న భాగస్వామ్యం వుంది. ముందుగా బాలకృష్ణగారి కోసం 'సింహాద్రి' కథను విజయేంద్ర ప్రసాద్ గారు రెడీ చేశారు".
"బాలకృష్ణగారికి నచ్చింది .. అంతా కలిసి కూర్చున్నాం .. ట్రీట్మెంట్ నడుస్తోంది. ఆర్డర్ అంతా అయ్యాక .. ఇక డైలాగ్స్ రాద్దామని అనుకుంటున్నాం. అప్పుడు బాలకృష్ణ 'వంశానికొక్కడు' చేశాను .. 'రౌడీ ఇన్ స్పెక్టర్' వుంది .. 'సమరసింహా రెడ్డి' చేశాను .. మళ్లీ అదే తరహాలో ఎందుకూ? కొత్తగా మరేదైనా చేద్దాం' అంటే ఆ కథను పక్కన పెట్టేశాం. ఆ తరువాత ఆ కథ ఎన్టీఆర్ కి సెట్ అయింది. రాజమౌళితో కలిసి పనిచేయకపోయినా .. అలా ఈ కథ చర్చల్లో మేం భాగస్వాములం కావడం జరిగింది" అని అన్నారు.