2018-19 budget: 2018-19 తెలంగాణ బడ్జెట్... బడ్జెట్ వివరాలు - 2
- మిషన్ భగీరథకు రూ. 1,801 కోట్లు
- మిషన్ కాకతీయకు రూ. 25వేల కోట్లు
- విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
బడ్జెట్ హైలైట్స్...
- వరంగల్ నగర అభివృద్ధికి - రూ. 300 కోట్లు
- పట్టణాభివృద్ధికి - రూ. 7,251 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు - రూ. 5,575 కోట్లు
- పంట పెట్టుబడి పథకానికి - రూ. 12వేల కోట్లు
- రైతు బీమా పథకానికి - రూ. 500 కోట్లు
- వ్యవసాయం, మార్కెటింగ్ కు - రూ. 15,780 కోట్లు
- పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు - రూ. 120 కోట్లు
- సాగునీటి ప్రాజెక్ట్ లకు - రూ. 25వేల కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖకు - రూ. 1,286 కోట్లు
- ఐటీ శాఖకు - రూ. 289 కోట్లు
- చేనేత, టెక్స్ టైల్ రంగానికి - రూ. 1,200 కోట్లు
- ఆరోగ్యలక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు
- మిషన్ భగీరథకు - రూ. 1,801 కోట్లు
- మిషన్ కాకతీయకు - రూ. 25వేల కోట్లు
- సాంస్కృతిక శాఖకు - రూ. 2వేల కోట్లు
- యాదాద్రి అభివృద్ధికి - రూ. 250 కోట్లు
- వేములవాడ దేవాలయం అభివృద్ధికి - రూ. 100 కోట్లు
- బాసర ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
- ధర్మపురి ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
- భద్రాచలం ఆలయ అభివృద్ధికి - రూ. 100 కోట్లు
- అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు
- హోంశాఖకు - రూ. 5,790 కోట్లు
- పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు
- విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు
- వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు
- విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు
- గురుకులాలకు - రూ. 2,823 కోట్లు