anoop rubens: 'జోగేంద్ర' పాటలో మా అబ్బాయి కనిపిస్తాడు: అనూప్ రూబెన్స్
- 'నేనే రాజు నేనే మంత్రి'కి సంగీతాన్ని అందించాను
- మంచి ఆదరణ లభించింది
- ఇందులో నా శ్రీమతి కూడా పాడింది
రానా కెరియర్లోనూ .. తేజ కెరియర్లోను 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో 'జోగేంద్ర .. జోగేంద్ర' అనే పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకి ఈ సాంగ్ ఒక పిల్లర్ మాదిరిగా నిలిచింది. తాజాగా ఐ డ్రీమ్స్ తో అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, ఈ సాంగ్ గురించి ప్రస్తావించారు.
ఈ సినిమాలో 'జోగేంద్ర' పాట ఆరంభంలో .. 'జోగేంద్ర' అంటూ ఒక చిన్న కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు తన కొడుకేననీ .. సెకండ్ క్లాస్ చదువుతున్నాడని అనూప్ రూబెన్స్ చెప్పాడు. ఈ సినిమాకి తాను సంగీతాన్ని అందించడం .. ఈ సినిమాలో 'సుమంగళీ .. ' అనే సాంగ్ ను తన శ్రీమతి ఆలపించడం .. తన తనయుడు 'జోగేంద్ర' సాంగ్ లో కనిపించడం ఒక మరిచిపోలేని అనుభూతి అంటూ చెప్పుకొచ్చారు.