Nitin Gadkari: త్వరలో ఐదు పైసలకే లీటరు తాగునీరు: కేంద్ర మంత్రి నితిన్ గఢ్కరీ

  • తమిళనాడులోని తూత్తుకూడిలో మొదలైన సముద్రపు నీటి నుంచి తాగునీరుగా మార్చే ప్రక్రియ
  • నదీ జలాల కోసం రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయని విమర్శ
  • పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తున్న భారత నదుల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన

సముద్రపు నీటి నుంచి తయారు చేసే తాగునీటిని త్వరలో ఐదు పైసలకే లీటరు అందిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గఢ్కరీ అన్నారు. ఈ దిశగా తమిళనాడులోని తూత్తుకూడి (ట్యుటికోరన్)లో సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే ప్రయోగాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. బాంద్రభన్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న నడి మహోత్సవంలో భాగంగా నిన్న జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కొన్ని రాష్ట్రాలు నదీ జలాల పంపిణీ కోసం కొట్లాడుకోవడం దురదృష్టకరమని పరోక్షంగా దక్షిణాది రాష్ట్రాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తున్న నదీ జలాల గురించి మాత్రం ఎవరూ ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. "భారత్‌లోని మూడు నదుల నీరు పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తోంది. కానీ ఏ వార్తాపత్రికైనా దీని గురించి రాస్తోందా? లేదా ఎవరైనా ఎంఎల్ఏ దీనిని ఆపాలని డిమాండ్ చేస్తున్నారా?" అని నితిన్ సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News