jagan: అక్టోబర్ నుంచి జగన్ కు రాజయోగం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాంగ శ్రవణంలో పండితులు
- ఎన్నికల్లో వైకాపాకు 135 సీట్లు
- 12 సంవత్సరాల 8 నెలలు సీఎంగా ఉండనున్న జగన్
- పంచాంగ శ్రవణంలో పండితులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అక్టోబర్ నుంచి రాజయోగం పట్టనుందని పంచాంగ శ్రవణంలో పండితులు వెల్లడించారు. అక్టోబర్ 25 వరకూ ఆయన జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని తెలిపారు. అవి పూర్తి కాగానే జగన్ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని, ఇదేమీ ముఖస్తుతి కోసం చెప్పబోవడం లేదని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ జాతకరీత్యా 135 సీట్లు వస్తాయని, తను చెప్పిన అంశం తప్పయితే, ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని అన్నారు. తాను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబుతున్నానని అన్నారు. జగన్ కు మంచి జరగనుందని, 2019 మే తరువాత 12 సంవత్సరాల, 8 మాసాల 18 రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని చెప్పారు. తాము 40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు.