Team India: మరికొన్ని గంటల్లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య టైటిల్ పోరు

  • కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-బంగ్లా జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్
  • భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం
  • డీ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానళ్లలో లైవ్

మరికొన్ని గంటల్లో నిదాహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ తుది పోరు జరగనుంది. భారత్-బంగ్లాదేశ్ జట్లు టైటిల్ పోరుకు రెడీ అయ్యాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానంలోనూ, 4 పాయింట్లతో బంగ్లాదేశ్ రెండో స్థానంలోనూ నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు ఈ రోజు అమీతుమీకి సిద్థమవుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మెగా ఫైట్‌కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. డీ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.

భారత్ జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), చాహల్, థావన్, హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, పాండే, రిషబ్ పంత్, పటేల్, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, శంకర్, ఠాకూర్, ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్

బంగ్లాదేశ్ జట్టు (అంచనా)
మహ్మదుల్లా (కెప్టెన్), అబూ హైదర్, అబూ జాయేద్, అరిఫుల్ హక్, ఇమ్రుల్ కాయేస్, లిటన్ దాస్, మెహిదీ హాసన్ మీరజ్, ముస్తఫిజర్ రెహ్మాన్, నజ్‌ముల్ ఇస్లాం, నూరుల్ హాసన్, రూబెల్ హుస్సేన్, సబ్బీర్ రెహ్మాన్, సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, తస్కిన్ అహ్మద్

  • Loading...

More Telugu News