Mohanbabu: పుట్టినరోజున ఫ్యాన్స్‌కు మోహన్‌బాబు సందేశం
- రేపు మోహన్‌బాబు 68వ పుట్టినరోజు
- కానుకలు, పుష్పగుచ్ఛాలు తీసుకురావొద్దని సందేశం
- కానుకలకు బదులుగా మొక్కలను గిఫ్టులుగా ఇస్తే సంతోషమని వెల్లడి
విలక్షణ నటుడు మోహన్‌బాబు రేపు 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశమిచ్చారు. పుష్పగుచ్ఛాలు, పూల మాలలు తన కోసం తీసుకురావొద్దని ఆయన ట్వీట్ చేశారు. తనకు ఏవైనా కానుకలు ఇవ్వదలచుకుంటే పుష్పాలకు బదులుగా మొక్కలను తీసుకురావాలని సూచించారు. ఈ కానుక తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.