Cricket: ఫైనల్ టీ20 మ్యాచ్: టీమిండియా విజయ లక్ష్యం 167 పరుగులు
- ముక్కోణపు టోర్నీలో చివరి పోరులో తలబడుతోన్న భారత్, బంగ్లాదేశ్
- 77 పరుగులు చేసిన బంగ్లా బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్
- టీమిండియా బౌలర్లలో చాహెల్ కి 3, ఉనద్కర్ కి 2 వికెట్లు
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ముక్కోణపు టోర్నీలో చివరి పోరులో టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఓపెనర్లు తమిమ్ ఇక్బల్ 15, లిటోన్ దాస్ 11 పరుగులకే ఔటయ్యారు. అయితే ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షబ్బీర్ రెహ్మాన్ మాత్రం ధాటిగా ఆడాడు. తోటి బ్యాట్స్‌మెన్ వెనువెంటనే అవుట్ అవుతున్నప్పటికీ క్రీజులో నిలదొక్కుకుని 77 పరుగులు చేశాడు.
ఇతర బ్యాట్స్‌మెన్‌లో సౌమ్య 1, రహీమ్ 9, మహ్మదుల్లా 21, షాకిబ్ అల్ హాసన్ 7, మెహిదీ హాసన్ 19, రుబెల్ హొస్సైన్ 0, రెహ్మాన్ 0 (నాటౌట్) పరుగులు తీశారు. ఎక్స్‌ట్రాల రూపంలో బంగ్లాదేశ్‌కి 6 పరుగులు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో చాహెల్ 3, ఉనద్కత్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.