allu arjun: బన్నీ మూవీలో ఫోక్ నంబర్ చేసిన స్వీడిష్ భామ
- 'నా పేరు సూర్య'లో ఫోక్ నెంబర్
- ఎల్లి అవ్రామ్ కు దక్కిన ఛాన్స్
- ఈ అవకాశం దక్కడం పట్ల ఆమె ఆనందం
వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ .. ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో ఐటమ్ నంబర్ ఉండకపోవచ్చనే టాక్ బయటికి వచ్చింది. దేశభక్తి నేపథ్యంతో కథ ఉండటం వలన .. కథాగమనానికి ఈ సాంగ్ అడ్డుపడుతోందని భావించి, ఐటమ్ సాంగ్ ను వద్దనుకున్నట్టుగా ప్రచారం జరిగింది.
అయితే జానపద బాణీలో సాగే ఒక పాటను చిత్రీకరించారనేది తాజా సమాచారం. ఈ సాంగ్ ను స్వీడిష్ భామ 'ఎల్లి అవ్రామ్' పై చిత్రీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించడం జరిగింది. ఈ పాటలో ఆమె మాత్రమే డాన్స్ చేస్తుందట. తనకి బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమనీ, అయితే ఆయనతో కలిసి డాన్స్ చేయాలనే కోరిక మాత్రం నెరవేరలేదని ఎల్లి చెప్పింది. బన్నీ సినిమాలో ఛాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.